Thandel: తండేల్ సినిమాకి నాగ చైతన్య, సాయిపల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం తండేల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి. వీరిద్దరు కలిసి నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న అడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా తండేల్ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రూయనిట్.

Thandel: తండేల్ సినిమాకి నాగ చైతన్య, సాయిపల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Thandel
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 04, 2025 | 7:00 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. విడుదలకు దగ్గరవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ దగ్గర నుంచి పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

సినిమా పై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ సినిమాలో అందమైన ప్రేమకథను చూపించనున్నారు. గతంలో లవ్ స్టోరీ సినిమాలో ఆకట్టుకున్న సాయి పల్లవి, నాగ చైతన్య. తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తండేల్ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

‘తండేల్ ‘ సినిమా కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని సమాచారం. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్‌లో అందుకున్న భారీ పారితోషకం ఇదే. అలాగే  సాయి పల్లవి చాలా డిమాండ్ ఉన్న నటి . తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో బిజీగా రాణిస్తుంది. గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇక ‘తండేల్ ‘ సినిమాలో నటించినందుకు సాయి పల్లవికి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..