సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ.. ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్..!
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆడియన్స్ ఊహలకు మించి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ జోడిగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వెంకీమామ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా భారీ మైల్ స్టోన్ దాటింది. దీంతో ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన హీరోలలో వెంకటేశ్ రికార్డ్ సృష్టించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.303 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని తెలిపింది. 20 రోజుల్లోనే దాదాపు రూ.303 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ మూవీ. కేవలం రూ.50 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందించిన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అటు మేకర్స్.. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు సైతం లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ సైతం నిర్వహించారు. ఈ చిత్రంతో భారీ లాభాలను గడించామని వెల్లడించారు. ఈ వేడుకలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సైతం పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్.. పోస్టర్ అదిరిందిగా..!
లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్ సాయి అరెస్ట్
అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్

పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్.. అలా ఎలా పెట్టావ్ పాప

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్ డ్యూయెట్..

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో
