గుర్తుపట్టలేనంతగా మారిన హీరో.. అసలు ఏమైంది ??
సినీ తారల క్రికెట్ లీగ్ సీసీఎల్ కు సంబంధించి ఫిబ్రవరి 02న హైదరాబాద్ లో ఓ ప్రమోషన్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో టాలీవుడ్ సినీ తారల తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీమ్ కెప్టెన్ అఖిల్ అక్కినేని తో పాటు తమన్, అశ్విన్, రఘు, సామ్రాట్.. ఇతర టాలీవుడ్ నటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తెలుగు వారియర్స్ టీమ్ యజమాని సచిన్ జోషి ఒకప్పటిలా స్లిమ్‌గా కాకుండా కాస్త బల్కీ బాడీతో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2002లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సచిన్ జోషి. మౌనమేలనోయి.. సినిమాతోనే మంచి మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ లో నటించి తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించినా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో నిర్మాతగా మారాడు. 2018లో రిలీజైన సందీప్ కిషన్ నెక్ట్స్ ఏంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. . కొన్ని సినిమాలకి ఫైనాన్స్ కూడా అందించాడు. ఇక చివరిగా 2019లో ఓ హిందీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు సచిన్ జోషి. ఇక సినిమాలకు దూరంగా ఉన్న సచిన్ జోషి రెండేళ్ల క్రితం వరుస వివాదాలతో వార్తల్లో నిలిచాడు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు టీంను ఓన్ చేసుకున్న ఈయన.. ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించాడు. తన కటౌట్ తో గుర్తు పట్టలేనంతగా మారడంతో.. ఇప్పుడు ఈయన నెట్టింట వైరల్ అవుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?
జలకన్య వేషంలో యువతి.. దాడి చేసిన భారీ చేప
ఒంట్లో ఐరన్ తగ్గిందా.. అయితే ఇలా చేయండి
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

విడాకులు కోరిన భార్య.. ఆ భర్త ఏం చేశాడో తెలుసా? వీడియో
