Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు

స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు

Phani CH

|

Updated on: Feb 04, 2025 | 8:32 PM

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి అకస్మాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. బాలీవుడ్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది.అయితే తన సినిమా కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే సంచలన నిర్ణయం తీసుకుంది. 2020 లో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది సనా. పెళ్లి తర్వాత దుబాయ్‌ కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం సనా ఖాన్ ఇద్దరు పిల్లలకు తల్లి. ఇక సినిమా రంగంలో ఉన్నప్పుడు సనా ప్రముఖ డ్యాన్సర్, స్టార్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో డేటింగ్ చేసింది. అయితే కొద్ది కాలానికే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సనా ఖాన్ మెల్విన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడా వీడియో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెల్విన్ చాలా అబద్ధాలు చెప్పి తనను మోసం చేశాడని చెప్పిన సనా.. అతను మైనర్ బాలికకు తరచూ డ్రగ్స్ ఇచ్చి ఆమెను గర్భవతిని కూడా చేశాడంటూ ఆరోపించింది. చాలా మంది అమ్మాయిల నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని.. అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని చెప్పింది. ఇక తనను కూడా చాలా సార్లు కొట్టాడని.. పరుషమైన మాటలతో దుర్భాషలాడాడంటూ ఎమోషనల్ అయింది. మెల్విన్ నిజ స్వరూపాన్ని గుర్తించడానికి తనకు ఒక సంవత్సరం పట్టిందంటూ సనా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను మెల్విన్ ఖండించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్తుపట్టలేనంతగా మారిన హీరో.. అసలు ఏమైంది ??

ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

జలకన్య వేషంలో యువతి.. దాడి చేసిన భారీ చేప

ఒంట్లో ఐరన్‌ తగ్గిందా.. అయితే ఇలా చేయండి

బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్