Pushpa 02: పుష్ప2 అరుదైన రికార్డ్.. ఏకంగా 21 దేశాల్లో ట్రెండింగ్

Pushpa 02: పుష్ప2 అరుదైన రికార్డ్.. ఏకంగా 21 దేశాల్లో ట్రెండింగ్

Phani CH

|

Updated on: Feb 04, 2025 | 7:34 PM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై రెండు నెలలైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి 2’ కలెక్షన్లను సైతం అధిగమించింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది.

ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న పుష్ఫ 2 సినిమా ప్రత్యేక గౌరవం దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ బయో చేంజ్ చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అంటే మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ను కూడా పుష్ప రాజే రూల్ చేస్తున్నాడన్నమాట. అంతేకాదు పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్-10లో కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. ఇక ఇండియా ట్రెండింగ్‍లో టాప్-1లో పుష్ప 2 సత్తాచాటుతోంది. ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‍ల్లో ప్రస్తుతం పుష్ప2 టాప్‍లో ఉంది. మొత్తంగా 21 దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డైరెక్టర్, కెమెరామెన్ కొత్త నిర్ణయం.. చరణ్‌కు మాత్రం ఛాలెంజ్!

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్‌ లుక్‌ రివీల్‌.. పోస్టర్‌ అదిరిందిగా..!

లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్‌ సాయి అరెస్ట్

అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??

Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Published on: Feb 04, 2025 07:33 PM