డైరెక్టర్, కెమెరామెన్ కొత్త నిర్ణయం.. చరణ్‌కు మాత్రం ఛాలెంజ్!
కథను రెడీ చేసుకున్నాక.. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశాక.. ఓ డైరెక్టర్ ఆ సినిమాను ఎలా తెరకెక్కించాలనే ప్రాసెస్ మొదలెడతాడు. తన సినిమాను కాస్త యూనిక్గా తెరకెక్కించాలని థింక్ చేస్తాడు. అందుకోసం సినిమా క్రాఫ్ట్స్‌లో వన్ ఆఫ్ ది కీ డిపార్ట్ మెంట్ అయిన కెమెరామెన్‌తో ముందు మాట్లాడతాడు. సినిమాను ఎలా పిక్చరైజ్ చేయాలని వారే ఓ నిర్ణయం తీసుకుంటారు.
అలా ఆర్సీ 16 కోసం డైరెక్టర్ బుచ్చిబాబు.. సినిమాటోగ్రాఫర్ రత్న వేలు ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ సినిమాను నెగెటివ్ ఫార్మాట్‌లో అంటే పాత కాలం రీల్ పద్దతిలో షూట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి నిర్ణయమే ఇప్పుడు చరణ్ కు కొత్త కష్టం తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే గొప్ప పేరు తెచ్చుకున్న రత్నవేలు.. ఆర్సీ 16కోసం పని చేస్తున్నాడు. అయితే డైరెక్టర్ నిర్ణయం మేరకు.. ఈ సినిమాలో పాత కాలం నెగెటివ్ వీడియోగ్రఫీని వినియోగించనున్నాడట. ఇందుకోసం ఇప్పటికే కొడాక్‌తో చర్చలు జరిపాడట. ఇక రత్నవేలు ప్రయోగానికి కొడాక్ ఇనిస్టిట్యూట్ సహాయం చేసేందుకు ఓకే చెప్పిందట. ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్ మయం అయింది. అయితే హాలీవుడ్ లో మళ్లీ నెగిటివ్ వినియోగించి సినిమా చిత్రీకరణలు చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. పూర్తి స్థాయిలో నెగెటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం తేలికైన విషయం కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే.. నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు .. అలా కాకుండా నెగెటివ్ తో షూట్ చేస్తే.. యాక్టర్స్ ఎక్కువ టేక్స్ తీసుకునే వీలు ఉండదు. ఎడిటింగ్ కూడా కష్టం. దీంతో రామ్ చరణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక దీన్నే మెన్షన్ చేస్తున్న కొంత మంది రామ్ చరణ్‌కు ఇదో ఛాలెంజ్ అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్.. పోస్టర్ అదిరిందిగా..!
లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్ సాయి అరెస్ట్
అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
