Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
తేగలు.. ఇవి ఒక సీజన్‌లో మాత్రమే దొరికే అద్భుత పౌష్టికాహారం. ఇవి మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. తేగల్లో విటమిన్ B, విటమిన్ C అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తేగల్లో 87 కిలో క్యాలరీలతో పాటు 77 గ్రాముల నీరు ఉంటుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్, నరాల సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.
తేగల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా.. ఇది శరీర కణాలను రక్షించడంతో పాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది. తేగల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. మధుమేహ రోగులు కూడా వీటిని తినొచ్చు. అయితే దీనిలోని కొన్ని పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల డాక్టర్ల సలహాతో లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవడం మంచిది. తేగల్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు కడుపులో పేరుకునే పురుగులను నివారించగలదు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అదుపు చేస్తుంది. తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకలకు, దంతాలకు బలాన్ని అందిస్తుంది. పిల్లలకు ఇది మేలైన ఆహారం. ఇది ఎముకల సమస్యలు, కండరాల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
