ట్రంప్ మామూలోడు కాదు.. ఉక్రెయిన్‌కీ పెట్టారుగా మెలిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పూర్తిగా బిజినెస్ టైకూన్‌లా ఇతర దేశాలతో డీల్ చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చేసే సాయంపైనా ఇలాగే ఓ మెలిక పెట్టారు. కీవ్‌కు తమ సైనిక సాయం కావాలంటే.. అక్కడి అరుదైన ఖనిజాలను వినియోగించుకొనే అవకాశం వాషింగ్టన్‌కు ఉండాలనే కండీషన్ పెడతామని వెల్లడించారు.
ఇప్పటికే ఐరోపాలోని భాగస్వాముల కంటే అమెరికానే అత్యధిక సైనిక, ఆర్థిక సాయాలను జెలెన్‌స్కీ సర్కారుకు అందించిందని గుర్తు చేశారు. ‘వారికి అవసరమైనప్పుడల్లా నిధులు, పరికరాలు ఇచ్చాం. ఐరోపా వారు ఈ విషయంలో వారి మాట నిలబెట్టుకోలేదు. వారు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. మాతో పోల్చుకుంటే వారు చాలా తక్కువ నిధులు, ఆయుధాలు ఇచ్చారు. కనీసం మాతో సమానంగా అన్నా ఇవ్వాలి. ఉక్రెయిన్ వద్ద చాలా అరుదైన ఖనిజాల భాండాగారం ఉంది. అందుకే మేము ఆ దేశంతో ఓ డీల్ చేసుకోవాలనుకుంటున్నాం. మాకు ఆ ఖనిజాలు లభిస్తే.. మేము వారికి అవసరమైనవి ఇస్తాం. ఉక్రెయిన్-రష్యా విషయంలో మేము చాలా పురోగతి సాధించాం. భవిష్యత్తులో ఏం జరగబోతోందో మనం చూస్తాం. ఆ యుద్ధాన్ని ఆపనున్నాం’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ ఏం చెప్పారంటే.. తాము ట్రంప్ బృందంతో టచ్‌లో ఉన్నామని .. ప్రస్తుతం జనరల్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో ఈ చర్చల్లో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం
Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
