ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
కార్తికేయ 2 హిట్ తర్వాత డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించింది. ఈ వేడుకకు యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకున్నామని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. తండేల్ టీజర్, ట్రైలర్ , సాంగ్స్.. ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తోందంటూ మాటలు షురూ చేసిన సందీప్ రెడ్డి వంగా… చైతన్య, సాయి పల్లవి తమతమ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పాడు. తాను కేడీ చిత్రానికి పని చేస్తున్న సమయంలో చైతన్యను చూశానని.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ తనకు చాలా ఇష్టమన్నాడు. కబీర్ సింగ్, యానిమల్ సినిమాల విషయంలో డిజైనర్ కు చైతన్య కాస్ట్యూమ్స్ రిఫెరెన్స్ గా చూపించేవాడిని అంటూ చెప్పాడు. ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవికి అభిమానిగా మారిపోయానని… తాను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవి అనుకున్నా అంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. అంతేకాదు అందుకు ఓ కోఆర్డినేటర్ ను సంప్రదించానని.. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఉంది.. ఆ విషయం మర్చిపోండి.. ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదని ఆ కో ఆర్డినేటర్ చెప్పడంతో… వేరే హీరోయిన్ ను సంప్రదించామన్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైతూ, సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ విని ఫ్యాన్స్ ఫుల్ గా సంతోషిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు
గుర్తుపట్టలేనంతగా మారిన హీరో.. అసలు ఏమైంది ??
ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో

ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..

గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్ రాసి చికిత్స.. కట్ చేస్తే..

అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే
