మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా అతను ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
ఇక శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీవాస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శ్రీ తేజ్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని కూడా ఇది వరకే ప్రకటించారు. తాజాగా నిర్మాత బన్నీ వాస్ మరోసారి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఫిబ్రవరి 2న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయన శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు చెప్పడంతో బన్నీవాసు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో శ్రీతేజ్‌కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే.. అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని బన్నీ వాసు చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు
గుర్తుపట్టలేనంతగా మారిన హీరో.. అసలు ఏమైంది ??
ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

విడాకులు కోరిన భార్య.. ఆ భర్త ఏం చేశాడో తెలుసా? వీడియో
