డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

Phani CH

|

Updated on: Feb 04, 2025 | 5:30 PM

కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్‌ సృష్టికర్త 40 ఏళ్ల లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్‌ ప్రపంచంలో ఎక్కడా వినబడని లియాంగ్‌ పేరు ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌ను మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే .

లియాంగ్‌ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. తండ్రి ఒక స్కూల్‌ టీచరు. ఈ–కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా సహా టెక్‌ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో లియాంగ్‌ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. లియాంగ్‌ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పేరిట చైనాలో ఒక హెడ్జ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్‌ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్‌ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్‌ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు 1.19 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్‌విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్‌ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్‌ఎల్‌ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదు లాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్‌ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్‌ సామర్థ్యాలతో, ఓపెన్‌ఏఐ చాట్‌ జీపీటీకి పోటీగా డీప్‌సీక్‌–ఆర్‌1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mohammed Siraj: బిగ్ బాస్ బ్యూటీకి మహమ్మద్ సిరాజ్ బౌల్డ్

రోడ్డును ఇలా కూడా నిర్మిస్తారా.. ఆశ్చర్యపోతున్న జనం

 

 

Published on: Feb 04, 2025 05:29 PM