అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
టెక్నాలజీ పరంగా అందరినీ మించిపోయేలా ఎదిగిన చైనా.. ఆహారపు అలవాట్లు, కొన్ని వింత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. చైనాలోని ఓ జూ ఇప్పుడు పులి మూత్రాన్ని విక్రయిస్తూ ప్రపంచవ్యాప్తంగా మరోమారు వార్తల్లో నిలిచింది.. అవును, చైనాలోని ఒక జూ పులి మూత్రాన్ని అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది.
బెణుకు, కండరాల నొప్పులు, వాతానికి దీనిని ఔషధంగా వారు ప్రచారం చేస్తున్నారు. 250 మిల్లీ లీటర్ల పులి మూత్రం 600 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో పులి మూత్రం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ ఇంటర్‌నెట్ వేదికగా విస్తృతంగా మొదలైంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ బిఫెంగ్జియా వైల్డ్‌లైఫ్ జూ 250 మిల్లీలీటర్ల సైబీరియన్ టైగర్ మూత్రాన్ని విక్రయిస్తోంది. దాదాపు 50 యువాన్లు అంటే.. 600 రూపాయలకి విక్రయిస్తోంది. పులి మూత్రం నింపిన బాటిళ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ పర్యాటకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. సిచువాన్ ప్రావిన్స్‌లోని ఒక జంతుప్రదర్శనశాల సైబీరియన్ పులి మూత్రాన్ని సీసాలో విక్రయిస్తోందనీ పులి మూత్రం కండరాల నొప్పి, దీర్ఘకాలిక రుమాటిజం, బెణుకుల నుండి ఉపశమనాన్ని అందిస్తుందనీ రాసుకొచ్చాడు. కాగా తెల్ల వైన్‌లో నానబెట్టిన అల్లం సహాయంతో నొప్పి ఉన్న ప్రదేశంలో పులి మూత్రాన్ని పూయాలని ఔషధ తయారీదారు సీసాలపై ముద్రించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
