Nag Ashwin : ప్రభాస్ సినిమాకోసం ఆనంద్ మహేంద్ర సాయం కోరిన నాగ్ అశ్విన్..

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు నాగ్ అశ్విన్.

Nag Ashwin : ప్రభాస్ సినిమాకోసం ఆనంద్ మహేంద్ర సాయం కోరిన నాగ్ అశ్విన్..
Nag Ashwin Anand Mahindra
Follow us

|

Updated on: Mar 04, 2022 | 2:45 PM

Nag Ashwin : ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు నాగ్ అశ్విన్. ఆతరువాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి అనే సినిమాను తెరకెక్కించాడు. దివంగత న నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాగ్ అశ్విన్, కీర్తిసురేష్ జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. మహా నటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. బేర్ బడ్జెట్ తో ఈ మూవీ ఉండబోతుందని ప్రకటించారు నాగ్ అశ్విన్. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్నారు.

అంతే కాదు ఈసినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అమితాబ్ , ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీ అని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. మొదటి నుంచి అనుకుంటున్నట్టే ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కథతోనే తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడట. అయితే ఈ సినిమాకు సాంకేతిక సాయం కావాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రను కోరారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘డియర్ ఆనంద్‌మహీంద్ర సార్ మేము అమితాబ్ బచన్, ప్రభాస్ మరియు దీపికలతో కలిసి ప్రాజెక్ట్ కే అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి మించి అధునాతన టెక్నాలజీతో ఈ సినిమాకోసం వాహనాలను రూపొందిస్తున్నాం. ఒకవేళ మా కల నిజమైతే అది మన దేశానికి గర్వకారణం అని భావించాలి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం.. అందుకోసం మీ సాయం కావలి. ఇంజనీర్ల విషయంలో మాకు మీ సాయంకావలి.  మీ దగ్గర టాలెంటెడ్, ఇండియన్ టీమ్ ఇంజనీర్లు , డిజైనర్లు ఉన్నారు..వారి సాయం మాకు అవసరం. ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు… భవిష్యత్తును రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే సంతోషిస్తాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు నాగ్ అశ్విన్. మరి ఆనంద్ మహేంద్ర నాగ్ అశ్విన్ విన్నపాన్ని మన్నిస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kriti Sanon: చీర కట్టు అందాలతో కేక పెట్టిస్తోన్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటోస్

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..