Project-K: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన నాగ్ ఆశ్విన్.. ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడంటే..

చేసింది తక్కువ సినిమాలే అయినా నాగ్ అశ్విన్ క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఇప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Project-K: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన నాగ్ ఆశ్విన్.. ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడంటే..
Project K
Follow us
Rajeev Rayala

|

Updated on: May 18, 2022 | 7:22 AM

చేసింది తక్కువ సినిమాలే అయినా నాగ్ అశ్విన్(Nag Ashwin )క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఇప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. ఆ తరువాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి అనే సినిమాను తెరకెక్కించాడు. దివంగత న నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాగ్ అశ్విన్, కీర్తిసురేష్ జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. మహా నటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

భారీ బడ్జెట్ తో ఈ మూవీ ఉండబోతుందని ప్రకటించారు నాగ్ అశ్విన్. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా వరకు కంప్లీట్ చేశాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమానుంచి తమకు సాలిడ్ అప్డేట్ కావాలంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాగ్ అశ్విన్ ను రిక్వస్ట్ చేస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే గురించి స్పందిస్తూ… రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను పూర్తి చేశాం. ప్రభాస్ ఇంట్రో సీన్స్  చిత్రీకరించాం. సినిమాలో ప్రభాస్ లుక్ చాలా కూల్ గా ఉంటుంది. జూన్ నుండి నెక్స్ట్  షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాం.ఈ  సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం అన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆలస్యం అవ్వొచ్చు.. ఎందుకంటే ప్రభాస్ చేస్తున్న సినిమాల లిస్ట్ లో ప్రాజెక్ట్ కే చివర్లో ఉంది అన్నట్టుగా నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Nag Ashwin

Nag Ashwin

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shekar Pre Release Event: శేఖర్‌ ప్రీ రీలీజ్ ఈవెంట్.. రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ పడేనా! వీడియో..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..