Venkatesh- Pooja Hegde: అన్న చెల్లెళ్లుగా వెంకటేష్, పూజాహెగ్డే.. ఏ సినిమా కోసమంటే

విక్టరీ వెంకటేష్, మెగా వీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది.

Venkatesh- Pooja Hegde: అన్న చెల్లెళ్లుగా వెంకటేష్, పూజాహెగ్డే.. ఏ సినిమా కోసమంటే
Venkatesh Pooja Hegde
Follow us
Rajeev Rayala

|

Updated on: May 18, 2022 | 7:50 AM

విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా వీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ , సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈపాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పూజతో వెంకీ , వరుణ్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ రానా తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు `రానా నాయుడు` అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. వీటితో పాటు వెంకీ ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారని ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న `కభీ ఈద్ కభీ దివాళీ` సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాలో అందాల భామ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో పూజ వెంకటేష్ సిస్టర్ గా కనిపించనుందట. ఫర్హాద్ సామ్జీ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ మూవీని సల్మాన్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలోని విలే పార్లేలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. ఇక ఈ మూవీలో వెంకటేష్  పూజా హెగ్డే అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారని.. సినిమాలో వీరిద్దరి మధ్య వున్న అనుబంధం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు.  వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ పాల్గొనబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shekar Pre Release Event: శేఖర్‌ ప్రీ రీలీజ్ ఈవెంట్.. రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ పడేనా! వీడియో..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..