Ram Pothineni : ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’.. రామ్ నయా మూవీ లుక్ అదిరిందిగా
డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా సినిమాలో రామ్ క్యారెక్టర్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్ లుక్ తాజాగా విడుదల చేశారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ రోజు ఆయన క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేష్ బాబు.
ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..
రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే… వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు… ఫస్ట్ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. కాగా రామ్ చివరిగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్ట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాతో రామ్ మరోసారి యూత్ ను ఆకట్టుకునే కథతో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మిస్టర్ బచ్చన్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో మరోసారి తన గ్లామర్ తో కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తుంది.
View this post on Instagram