Shobitha vs Samantha: పాపులర్ సెలబ్రెటీల లిస్ట్‌లో శోభిత తర్వాతే సమంత.!
సినీ నటి సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితాలో శోభిత ధూళిపాళ కంటే సమంతను వెనక్కి నెట్టారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో శోభిత ఐదో స్థానంలో ఉండగా సమంత ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ఈ ఏడాది ‘బ్యాడ్ న్యూజ్’, ‘లైలా మజ్ను’ రీరిలీజ్ ‘భూల్ భులయ్యా 3’ సినిమాలు విడుదలైన నేపథ్యంలో త్రిప్తి డిమ్రీ ఈ జాబితాలో టాపర్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్ సందర్శకుల వాస్తవ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు ఐఎండీబీ వెల్లడించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో దీపికా పదుకొణే, మూడో స్థానంలో ఇషాన్ ఖత్తర్, నాలుగో స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఐదో స్థానంలో శోభిత ధూళిపాళ ఉన్నారు. చైతూతో పెళ్లితో పాటు ఆమె నటించిన మంకీ మ్యాన్ విడుదల సందర్భంగా నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని ఐఎండీబీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శార్వరీ, ఐశ్వర్య రాయ్ ఉండగా ఎనిమిదో ర్యాంక్ ను సమంత దక్కించుకున్నారు. సమంత నటించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ విడుదల, హీరోయిన్ అనారోగ్యం తదితర కారణాలతో నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా వెతికారని ఐఎండీబీ వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

