Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌‌కు మస్త్ న్యూస్ చెప్పిన తమన్.. నయా రికార్డ్స్ పై నజర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు.  వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న మహేష్.. రీసెంట్ గా  సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌‌కు మస్త్ న్యూస్ చెప్పిన తమన్.. నయా రికార్డ్స్ పై నజర్..
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 6:00 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. ఆయా సినిమాలు సంబందించిన చిన్న అప్డేట్ అయిన దాన్ని క్షణంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న మహేష్.. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పోకిరి సినిమా తర్వాత మహేష్ ను మరో సారి ఆ రేంజ్ లో చూపించి సక్సెస్ అయ్యాడు పరశురామ్. మహేష్ డైలాగ్ మాడ్యులేషన్స్.. హీరోయిన్ కీర్తిసురేష్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన హైలెట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీతర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజాకార్యక్రమాలతో ఈ మూవీ మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అంటున్నారు. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు పూర్తి భిన్నంగా ఈమూవీ ఉండనుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఎంపిక చేశారు. అలాగే తమన్ ఈ సినిమా సంగీతాన్ని అందుంచనున్నాడు. ఇప్పటికే తమన్ ఈ మూవీ కోసం ట్యూన్స్ రెడీ చేసే పనిలో ఉన్నారు. మా కొత్త జర్నీ సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టబోతోందని తాజాగా తమన్ .. త్రివిక్రమ్ తో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు తమన్.  SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జూలై రెండవ వారం నుంచి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో ఇటలీకి వెకేషన్ కు వెళ్లారు. త్వరలోనే వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు రానున్నారు మహేష్..వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.