Suriya: బాలీవుడ్ స్టార్ హీరో కోసం రంగంలో సూర్య.. మరోసారి అతిథి పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధం..

ఇటీవల కమల్ హాసన్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమా అతిథి పాత్రలో నటించి మెప్పించాడు.. చివరలో 3 నిమిషాలు ఎంట్రీ ఇచ్చి సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్లాడు..

Suriya: బాలీవుడ్ స్టార్ హీరో కోసం రంగంలో సూర్య.. మరోసారి అతిథి పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధం..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2022 | 12:42 PM

తమిళ్ స్టార్ సూర్య.. రొమాంటిక్ చిత్రాలైనా.. మాస్ యాక్షన్ సినిమాలైనా.. అన్నింటా తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సూర్య స్టైలే వేరు.. కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్‏లోనూ ఈ హీరోకు అమితమైన క్రేజ్ ఉంది (Suriya).. హీరోయిజం కోసమే కాకుండా.. ప్రాధాన్యత ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ నేషనల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు .. ఇటీవల జైభీమ్ సినిమాతో నటనకు తాను ఇచ్చే ఇంపార్టెంట్ ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు సూర్య.. ఇక ఇటీవల కమల్ హాసన్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమా అతిథి పాత్రలో నటించి మెప్పించాడు.. చివరలో 3 నిమిషాలు ఎంట్రీ ఇచ్చి సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్లాడు.. ఈ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ నచ్చితే చాలు హీరోగానే కాకుండా.. గెస్ట్ రోల్స్ చేయడానికైనా సిద్ధమంటూ చెప్పేశాడు ఈ హీరో.. తాజాగా మరోసారి గెస్ట్ రోల్ చేయబోతున్నాడట.. అది కూడా బాలీవుడ్‏లో..

సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన సూరరై పోట్రు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు ఆకాశమే నీ హద్దురా పేరుతో తెలుగులోకి డబ్ చేయగా..టాలీవుడ్ లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా.. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు హీరో అక్షయ్ కుమార్. ఈ చిత్రానికి అక్కడ కూడా డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాను ఓ గెస్ట్ రోల్ చేసినట్లుగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు హీరో సూర్య. అక్షయ్ కుమార్, డైరెక్టర్ సుధా కొంగరకు థ్యాంక్స్ చెబుతూ తనతో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు సూర్య. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో