MS Dhoni: మరోసారి వెండితెరపై ‘ఎంఎస్ ధోనీ’ జీవితకథ.. రీ రిలీజ్ ఎప్పుడంటే..

త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రి మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోనీ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

MS Dhoni: మరోసారి వెండితెరపై 'ఎంఎస్ ధోనీ' జీవితకథ.. రీ రిలీజ్ ఎప్పుడంటే..
Ms Dhoni The Untoled Story
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2023 | 8:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలే కాదు.. డిజాస్టర్ అయిన సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే మొదటిసారి విడుదలైన సినిమాలు ప్లాపులు కాగా..ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. అందుకు ఉదాహరణే ఆరెంజ్ చిత్రం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్,, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇక త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రి మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోనీ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి సైతం ఎంతగానో అభిమానించే ఈ స్టార్ క్రికెటర్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎంఎస్ ధోని చిత్రంలో ఆయన ప్రేమ, పెళ్లి గురించి మాత్రమే కాకుండా క్రికెట్ ప్రస్థానాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్ తో 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రలో నటించగా.. దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు.

డైరెక్టర్ నీరత్ పాండే తెరకెక్కించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలోనే ఓసారి ప్లాన్ చేయగా… అప్పుడు కుదరలేదు. అయితే ఇప్పుడు మరోసారి రిలీజ్ చేయనున్నారట. ధోని బర్త్ డే కానుకగా ఈ మూవీని జూలై 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..