Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Elections 2021: ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. లెక్కలు మారుతున్నాయ్

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు 'మా' ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్....

Maa Elections 2021: 'మా' ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. లెక్కలు మారుతున్నాయ్
Maa News
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2021 | 3:16 PM

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు. సీవిఎల్ నరసింహారావు తెలంగాణ వాదంతో పోటీలో ఉన్నారు. రెండేళ్లు మాత్రమే వుండే ఈ పదవి కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు బరిలో నిల్చున్నవారు. లోకల్, నాన్ లోకల్ వాదంతో మొదలైంది ఎన్నికల పోటీ. ఒకరేమో బిల్డింగ్ కడతాం అన్నారు. ఇంకొకరు ‘మా’ సంక్షేమం అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇస్తున్నారు. చివరికి ఎవరు ఈ సారి ‘మా’ అసోసియేషన్ అధ్యక్ష పీఠం ఎక్కుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పోటీ జరగలేదు. ఈసారి మాత్రం ఏకంగా అయిదుగురి పేర్లు తెరపైకి రావడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. కేవలం ఇగో… వీళ్ళని ఇంతవరకు తెచ్చింది. గత సంవత్సరం నుండే ప్రకాష్ రాజ్ పోటీకి ప్రణాళికలు రచించి, ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. అందరి కంటే ముందుగా తన ప్యానెల్‌ను ప్రకటించారు. తాను అధ్యక్షుడిని అయితే ఏమి చేస్తానో చెప్పాడు. మెగా బ్రదర్ నాగబాబును పక్కన పెట్టుకుని మెగా కాంపౌండ్ సపోర్ట్ తనకే ఉందని ప్రూవ్ చేసారు. ‘మా’ సభ్యుల చిరకాల స్వపం…మా భవనం తన సొంత ఖర్చులతో కడతానని ప్రకటించాడు మంచు విష్ణు. మా భవనానికి స్థలాలు చూశానని ప్రకటించి ప్రచారంలో ఓ అడుగు ముందుకేసాడు. నటి హేమ ‘మా’ లో వేడి పుట్టించింది. ‘మా’ నిధులను ఖర్చు చేసారు అంటు నరేష్‌పై ఆరోపణలు చేసింది. నరేష్, జీవిత.. హేమ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో పరిస్థితి మరింత దిగజారడంతో సీన్లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ‘మా’ సభ్యుల బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి అంటూ లేఖాస్త్రం సంధించాడు. ప్రస్తుత కమిటీలో సెక్రెటరీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న జీవితకు మంచు విష్ణు ప్యానెల్ లో మరలా సెక్రెటరీ పోస్ట్ రిజర్వ్ చేసినట్లు సమాచారం. జీవిత మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మంచు విష్ణు ప్యానల్ మద్దతుతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతు తీసుకునేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంవత్సరం నుంచి ప్యానెల్ ప్లాన్ చేసుకున్న ప్రకాష్‌రాజ్ సెక్రెటరీ పోస్ట్ విషయంలో రాజీ పడతాడా? జీవితకు మద్దతు ఇస్తాడా లేక పోటీగా అభ్యర్థిని బరిలో నిలబెడతారా ? అన్నది చూడాలి.

మరో వైపు ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ మరల పోటీ చేసే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్‌ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న జీవితా రాజశేఖర్ కు మంచు విష్ణు ప్యానల్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో సెక్రెటరీగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. జీవితకు పోటీగా సీనియర్ నటి జయసుధను బరిలోకి దింపుతారా లేక సీనియర్ నటుడు బెనర్జీని సెక్రటరీగా పోటీలోకి దింపుతారా లేదా రెండు మానేసి ఇండిపెండెంట్‌గా ఉన్న జీవితకు మద్దతు ఇస్తారా? అనే చర్చ నడుస్తోంది. మరోవైపు నటి హేమ కూడా అధ్యక్ష స్థానం పోటీ విరమించుకుని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఏదో ఒక పదవికి పోటీ చేసే లాగా ప్రకాష్‌రాజ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ గ్రూపు ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారనుంది.

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తన ప్యానెల్ పేర్లను ప్రకటించిన ప్రకాష్‌రాజ్ కూడా కొంత మార్చుకునే అవకాశం ఉంది. ఆ ప్యానెల్ లో ప్రకటించిన ఒకరిద్దరు అభ్యర్థులకు పోటీ చేసే హక్కు లేకపోవటంతో వాళ్ళ ప్లేస్‌లో కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాష్ రాజ్ టీంలోని సీనియర్ నటి జయసుధ ఎన్నికల పోటీ కూడా అనుమానాస్పదమే అంటున్నారు కొందరు. మంచు ఫ్యామిలికి అత్యంత సన్నిహితురాలైన జయసుధ మంచు విష్ణుకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం లేదనేది ఫిల్మ్ నగర్ టాక్. వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడంతో మొదలుపెట్టిన ఎన్నికల ప్రచారం విందు రాజకీయాల వరకు వెళ్ళింది. మేము అంతా ఒకటే.. ‘మా’ అంతా ఒకటే ఫ్యామిలీ… మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలు అని చెప్పుకునే ‘మా’ సభ్యులు.. ఈ ఎన్నికలకు మాత్రం సాధారణ ఎన్నికల స్థాయిలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇన్ని మార్పులు చేర్పుల నడుమ, సమయానుకూలంగా గోడ దూకే అభ్యర్థులు ఎవరు, చివరకు ప్రకాష్ రాజ్ టీంలో ఉండేది ఎవరు, మంచు విష్ణు ప్యానెల్‌లో ఉండేది ఎవరో మరో వారంలో తెలిసే అవకాశం ఉంది.

Also Read:  రకుల్‌కు ఈడీ షాక్.. అలాంటి పప్పులేం ఉడకవన్న అధికారులు..

రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. ఇది చెబుతోంది ఎవరో కాదండీ