Rakul Preet Singh: రకుల్‌కు ఈడీ షాక్… అలాంటి పప్పులేం ఉడకవన్న అధికారులు..

డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. హీరోయిన్ రకుల్ ఈడీ అధికారులకు లేఖ రాసింది. అయితే ఆ లేఖపై అధికారులు సీరియస్‌గా స్పందించారు.

Rakul Preet Singh: రకుల్‌కు ఈడీ షాక్... అలాంటి పప్పులేం ఉడకవన్న అధికారులు..
Rakul Preet
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2021 | 3:20 PM

డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులను రకుల్ కోరింది. తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.  కాగా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపిన సమయంలో అందులో రకుల్ పేరు లేదు. తాజాగా ఈడీ అధికారుల లిస్ట్‌లో మాత్రం ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన ఈడీ ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించింది.

కొనసాగుతోన్న చార్మీ విచారణ

తాజాగా డ్రగ్స్‌ కేసులో చార్మిని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా కెల్విన్‌తో ఉన్నడ్రగ్స్‌ లింక్‌లపై ఆరా తీస్తున్నారు. కెల్విన్‌తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది ? కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో మీ పేరు ఎందుకు ఉందని ఆరా తీస్తున్నారు. కెల్విన్‌ డ్రగ్స్‌ దందాలో మీకు భాగస్వామ్యం ఉందా ? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ లో చార్మి పేరు ఉండటంతో నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు చార్మిని విచారిస్తున్నారు. కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో చార్మి పేరు దాదాగా సేవ్‌ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. దాదా పేరుతో ఉన్న ట్రాన్జాక్షన్స్‌ని గుర్తించారు ఈడీ అధికారులు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతోనే చార్మిని విచారిస్తున్నారు. ఈడీ అధికారులకు తన రెండు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లను ఇచ్చింది చార్మి. అయితే 2013 నుంచి 2018 వరకు మూడేళ్ల పాటు జరిగిన బ్యాంక్‌ లావాదేవీలను ఈడీ అధికారులకు సమర్పించింది చార్మి. ఆమెతో తన సీఏ సతీష్‌ ను వెంట పెట్టుకుని ఈడీ విచారణకు హాజరైంది చార్మి. ఈడీ విచారణ కోసం ఆఫీస్‌ లోనికి వెళ్లే ముందు టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు చార్మి. ఈడీ విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

అటు పూరీ జగన్నాథ్‌, చార్మి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ లింక్‌లపై ఉన్న ఆధారాలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొన్న పూరీతో జరిపిన విచారణకు కొనసాగింపుగా చార్మిని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ లింక్‌లు ఉన్నాయా ? వీరితో పాటు ఇంకెవరైనా సహకరించారా ? అనే విషయాలు రాబడుతున్నారు.

Also Read: కొండచిలువ ఆకలి తీర్చుకోవడనికి వెళ్లి.. చేపలను కడుపారా తింది.. అంతలోనే ఆయువు పోయింది

రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. ఇది చెబుతోంది ఎవరో కాదండీ.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?