New Year 2024: మోస్ట్ అవైటెడ్ మూవీస్.. వచ్చే ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాలు..
ఇప్పుడు రాబోయే పాన్ ఇండియా సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరం.. కొత్త చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. పుష్ప 2 నుంచి కల్కి 2898AD సినిమాలపై ఇప్పటికే ఓరేంజ్ హైప్ ఏర్పడింది. 2024 దక్షిణాది సినీ చరిత్రలో ఒక మైలురాయిగా ఉండిపోనుంది. అలాగే వచ్చే ఏడాది అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొట్టగలవని భావిస్తున్నారు మేకర్స్. రాబోయే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త ఏడాదికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఈ సంవత్సం చిన్న సినిమాల దగ్గర్నుంచి పెద్ద చిత్రాల వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాబోయే పాన్ ఇండియా సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరం.. కొత్త చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. పుష్ప 2 నుంచి కల్కి 2898AD సినిమాలపై ఇప్పటికే ఓరేంజ్ హైప్ ఏర్పడింది. 2024 దక్షిణాది సినీ చరిత్రలో ఒక మైలురాయిగా ఉండిపోనుంది. అలాగే వచ్చే ఏడాది అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొట్టగలవని భావిస్తున్నారు మేకర్స్. రాబోయే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 2..
2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇప్పుడు ఈ సినిమా సిక్వెల్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమారన్ ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానుంది.
తంగలాన్..
పా. రంజిత్ దర్శకత్వం వహించిన చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తంగలాన్. ఇందులో విక్రమ్, పశుపతి, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్ కీలకపాత్రలు పోషించారు. 2024లో అత్యధికంగా హైప్ ఏర్పడిన సినిమా ఇదే. ఈ చిత్రం 26 జనవరి 2024 విడుదల కానుంది. భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో కాలంలోని ఈ సినిమా చేస్తుంది.
గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సినిమా గుంటూరు కారం. 2021లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా చాలా కాలం తర్వాత ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
దేవర..
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా దేవర. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని రెండుభాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల చేయబడుతుంది,
భారతీయుడు 2..
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా ఇండియన్ 2. 1996లో విడుదలైన ఇండియన్ సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
గేమ్ ఛేంజర్..
డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2024 విడుదలకు సిద్ధంగా ఉంది.
కంగువ.. తమిళ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కంగువ. ఇందులో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 11 ఏప్రిల్ 2024న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కల్కి 2898AD..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898AD. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల అవుతుంది. ఈ చిత్రం 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
