Pushpa Villain : అల్లు అర్జున్ పుష్ప మూవీ కోసం విలన్ గా జాతీయ అవార్డు విన్నర్ ను దింపిన చిత్ర బృందం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  తొలిసారిగా బన్నీ తో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా జోడీ కడుతుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా ...

Pushpa Villain :  అల్లు అర్జున్ పుష్ప మూవీ కోసం విలన్ గా జాతీయ అవార్డు విన్నర్ ను దింపిన చిత్ర బృందం
Pushpa Villion
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2021 | 10:43 AM

Pushpa Villain :  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  తొలిసారిగా బన్నీ తో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా జోడీ కడుతుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తీసుకున్నారు.. అయితే అనుకోని కారణాలతో ఆ హీరో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో తాజాగా సరికొత్త విలన్ అంటూ రాకరాక పేర్లు షికారు చేశాయి. అయితే చివరిగా చిత్ర యూనిట్ అధికారికంగా పుష్ప సినిమాలో విలన్ ను పరిచయం చేసింది.

ఫహదా పాజిల్ ను పుష్ప సినిమా కోసం విలన్ గా ఎంపిక చేశారు. మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. పాజిల్ తన నటనకు గాను జాతీయ అవార్డు ను ఇప్పటికే అందుకున్నారు. ఇవే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. విలన్ ను పరిచయం చేసింది. బన్నీ, సుక్కు కాంబోలో లోశేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తునన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల వైకుంఠపురంలోన బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ చేస్తున్న నెక్స్ట్ మూవీ పుష్ప.. ఈ మూవీలో తన లుక్ డిఫరెంట్ గా ఉండడం కోసం ఎండలో కూర్చుని చాలా కష్టపడ్డాడు వంటి అనేక వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రెండు సన్నివేశాలు లీకయ్యి చిత్ర యూనిట్ కే షాక్ ఇస్తే.. అభిమానులకు హ్యాపీ కలిగించింది. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్‌, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్‌ సీన్‌.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.

Also Read: వామ్మో.. లేడీ కాదు.. పెద్ద కిలాడీ.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది.. చివరికి..

ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్‌ – అంబులెన్స్‌ ఢీః.. నలుగురు మృతి.. ముగ్గురికి గాయాలు