AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moddu Seenu: జైలు నుంచి గొల్లపూడి మారుతీరావుకు మొద్దు శీను లేఖ.. ఎందుకంటే…

మొద్దు శీను.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఇది పరిచయం అక్కర్లేని పేరు. 2005 జనవరి 24న టీడీపీ సీనియర్ నేత పరిటాల రవిని దారుణంగా హతమార్చింది తానేనని ప్రకటించుకున్న వ్యక్తి ఇతడు. నా బావ సూరి కళ్లలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని తాను హత్య చేశానని బాహాటంగా మీడియాతోనే చెప్పి సంచలనం సృష్టించాడు.

Moddu Seenu: జైలు నుంచి గొల్లపూడి మారుతీరావుకు మొద్దు శీను లేఖ.. ఎందుకంటే...
Gollapudi Maruti Rao -Moddu Seenu
Ram Naramaneni
|

Updated on: May 26, 2024 | 8:01 PM

Share

మొద్దు శీను.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన పేరు. మొద్దు శీను అసలు పేరు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి. టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన ఘటనలో ఇతను ప్రధాన నిందితుడు. పరిటాల రవిని హతమార్చినది తానే అని స్వయంగా మొద్దు శీనునే మీడియా ముఖంగా వెల్లడించాడు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఈ పని చేశానని శీను చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ డైలాగ్ కూడా విపరీతమంగా పాపులర్ అయింది. ఈ కేసులో లొంగిపోవడానికి ముందు టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మొద్దు శీను మాట్లాడిన తీరు అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దు శీను హత్యకు గురయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆయన గురించి ఓ ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది.

బయట ప్రపంచానికి మొద్దు శీను కరుడుగట్టిన నేరస్థుడిగా మాత్రమే తెలుసు. కానీ అతడిలో మరో కోణం కూడా ఉందని తాజాగా వెల్లడైంది. భావోద్వేగాలకు కరిగిపోయే సున్నితమైన మనస్సు మొద్దు శీనుకు ఉందని ఓలేఖ ద్వారా తేటతెల్లమైంది. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో మొద్దు శీను.. ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు రాసిన లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.  ఈ లేఖ సారాంశాన్ని ప్రముఖ ఎన్నారై కిరణ్ ప్రభ వివరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మారుతీరావుకు రాసిన లేఖలో త్రిశూలం సినిమాలో మీరు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి మీ బుర్ర బద్దలు కొట్టాలనిపించిందని, మీరు ఎక్కడ దొరుకుతారా అని చాలా రోజులు ఎదురు చూశానని మొద్దు శీను లేఖలో పేర్కొన్నాడు. అది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని వివరించాడు. ఎర్ర సీత నవల చదివానని, దాంట్లో ఎర్ర సీతను ఏడిపించిన తీరు.. సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించిన తీరుతో తాను ముగ్ధుడైనట్లు పేర్కొన్నాడు. తనకు కూడా చిన్నతనం నుంచి ఎదుటి వాళ్లు బాధపడితే సాంత్వన కలిగించాలని ఉంటుందని, తన హృదయాన్ని కరిగించారని లేఖలో మొద్దు శీను రాసుకొచ్చారు. నక్సలైట్లు ఎందుకండీ ప్రపంచాన్ని మార్చడానికి.. గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలని, ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్‌తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ.. మొద్దు శీను నాలుగు పేజీల సుధీర్ఘ లేఖ రాశాడు. మీరెప్పుడైనా కనిపిస్తే కన్నీళ్లతో మీ పాదాలను కడగాలని ఉంది. మీ పర్మిషన్  లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటోన్న మీ శిష్యుడు మొద్దు శీను’ అంటూ చర్లపల్లి జైల్లో ఉండగా గొల్లపూడి మారుతీరావుకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.