Virat Kohli: కోహ్లీ అభిమానించే ఏకైక తెలుగు హీరో అతడే… వీడియో కాల్స్ కూడా

అసాధారణ ఆటతీరుతో లెజెండ్‌గా మారిపోయిన కోహ్లీ.. ఇప్పటికీ అదే ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కోహ్లీ తనకు టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసేశాడు. ఆ సంగతులు ఏంటో తెలుసకుందాం పదండి...

Virat Kohli: కోహ్లీ అభిమానించే ఏకైక తెలుగు హీరో అతడే... వీడియో కాల్స్ కూడా
Virat Kohli
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2024 | 6:47 PM

 టీమ్​ఇండియాక్రికెటర్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్..  విరాట్ కోహ్లీకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో కోహ్లీ ఆటతో పాటు అతడి దూకుడు స్వభావాన్ని కూడా చాలామంది ఇష్టపడతారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విరాట్‌కు ఫ్యాన్స్ ఉంటారు. అంతటి కోహ్లీ ఓ తెలుగు హీరోని అభిమానిస్తాడని మీకు తెలుసా..? నిజమే. ఆ హీరోతో బాండింగ్ గురించి రీసెంట్‌ ఇంటర్వ్యూలో కోహ్లీ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు. ఆ హీరో మరెవరో కాదండోయ్.. నందమూరి తారక రామారావు. అవును.. తారక్ యాక్షన్, డ్యాన్స్‌తో పాటు వ్యక్తిత్వం అంటే కూడా ఇష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు.  కొన్నేళ్ల క్రితం ఓ యాడ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించానని.. ఆ సమయంలో ఎన్టీఆర్‌  ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు చాలా నచ్చిందని.. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినట్లు తెలిపాడు.

కోహ్లీకి RRR సినిమాలోని నాటు, నాటు సాంగ్‌ అంటే చాలా ఇష్టం. తన భార్య అనుష్క శర్మతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్‌లు వేసిన వీడియోలో సోషల్‌ మీడియాలో కూడా పంచుకున్నాడు. కోహ్లీ ఓ మ్యాచ్‌ ఆడుతున్న సందర్భంలో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చిందని తెలిసింది. అప్పుడు గ్రౌండ్‌లోనే నాటు నాటు సాంగ్‌ స్టెప్పులు వేసి, తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఏమైనా స్పెషల్‌ డేస్‌, ఈవెంట్స్‌  ఉన్నప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతుంటానని కోహ్లీ తెలిపాడు.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరక్షన్‌లో రాబోతున్న దేవర ఫస్ట్ పార్ట్‌ అక్టోబర్‌ 10న విడుదల అవ్వనుంది. మరో వైపు కోహ్లీ, ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌కు సన్నద్దమవుతున్నాడు. జూన్‌ 2 నుంచి US, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచ కప్‌ మొదలు కానున్న విషయం తెలిసిందే.

Kohli Ntr

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.