Love Me Review: హిట్టా.? ఫట్టా.? “లవ్ మీ ఈఫ్ యూ డేర్” మూవీ ఎలా ఉందంటే.?

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా లవ్ మీ. ఈ సినిమాతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దెయ్యంతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం.. అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో భార్యా భర్తలతో ఓ చిన్న కుటుంబం ఉంటుంది. రాత్రి అయితే చాలు 8 నుంచి 9 గంటల మధ్యలో ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపిస్తుంటాయి.

Love Me Review: హిట్టా.? ఫట్టా.? లవ్ మీ ఈఫ్ యూ డేర్ మూవీ ఎలా ఉందంటే.?

|

Updated on: May 26, 2024 | 5:09 PM

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా లవ్ మీ. ఈ సినిమాతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దెయ్యంతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో భార్యా భర్తలతో ఓ చిన్న కుటుంబం ఉంటుంది. రాత్రి అయితే చాలు 8 నుంచి 9 గంటల మధ్యలో ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపిస్తుంటాయి. అనుకోకుండా ఒకరోజు రాత్రి భార్య ఒంటికి నిప్పు అంటించుకుని చచ్చిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త కూడా చనిపోతాడు. కానీ వాళ్లకు ఓ పాప ఉంటుంది. ఆ సీన్ అక్కడితో అయిపోతుంది. అసలు కథలోకి వస్తే.. అర్జున్ అలియాస్ ఆశిష్ రెడ్డి, ప్రతాప్ అలియాస్ రవికృష్ణ ఇద్దరూ అన్నాదమ్ములు. వాళ్లిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలు ఇలాంటి వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. వాళ్ల ఛానెల్‌లోనే కంటెంట్ హెడ్‌గా పని చేస్తుంటుంది ప్రియ అలియాస్ వైష్ణవి చైతన్య. ప్రియ కేవలం హెడ్ మాత్రమే కాదు ప్రతాప్ గళ్ ఫ్రెండ్. ఓ రోజు ప్రతాప్‌కు ఆ ఇంట్లో ఉండే పాప గురించి తెలుస్తుంది. కొన్ని రోజులకే ఆ పాప చనిపోయిందని.. అదే ఇంట్లో దివ్యావతి అనే పేరుతో దెయ్యమై ఉంటుందని అర్జున్‌కు చెప్తాడు. దాంతో ఆ దెయ్యం కథేంటో చూడాలని బయల్దేరతాడు అర్జున్. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దెయ్యంతోనే ప్రేమలో పడతాడు అర్జున్. అక్కడ్నుంచి అసలు ఆ దివ్యవతి ఎవరు..? ఎందుకు చనిపోయింది.. ఎలా చనిపోయింది అని వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అర్జున్‌కు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవేంటి అనేది అసలు కథ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.