Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ‘నేనుచిరంజీవికి డై హార్డ్‌ ఫ్యాన్‌.. మెగాస్టార్‌ తర్వాత ఆ హీరోనే నా ఫేవరెట్‌’ : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉంటారు. దీనికి తోడు త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారామె. పాలిటిక్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్సీ కవిత తాజాగా నెటిజన్లతో ముచ్చటించారు

MLC Kavitha: 'నేనుచిరంజీవికి డై హార్డ్‌ ఫ్యాన్‌.. మెగాస్టార్‌ తర్వాత ఆ హీరోనే నా ఫేవరెట్‌' : ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha, Chiranjeevi
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Nov 02, 2023 | 4:21 PM

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉంటారు. దీనికి తోడు త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారామె. పాలిటిక్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్సీ కవిత తాజాగా నెటిజన్లతో ముచ్చటించారు. #AskKavitha అంటూ ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. ఈ సందర్బంగా రాజకీయాలు, సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. ఇందులో భాగంగా ఒక నెటిజన్‌.. ‘చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి’ అని ఒక నెటిజన్ కవితను అడిగారు. దీనికి ఆమె ‘డై హార్డ్ ఫ్యాన్’ అని ఆన్సర్‌ ఇచ్చారు. అలాగే మరో నెటిజన్ కూడా మీ ఫేవరేట్ హీరో ఎవరు మేడమ్ అని అడగ్గా.. ‘మెగాస్టార్‌ చిరంజీవి ఆల్వేస్‌.. నెక్ట్స్ అల్లు అర్జున్.. తగ్గేదేలే’ అంటూ జిఫ్‌ ఇమేజ్‌ను షేర్‌ చేశారు కవిత. ప్రస్తుతం కవిత చెప్పిన సమాధానాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసి చిరంజీవి, అల్లు అర్జున్‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఎమ్మెల్సీ కవిత మెగా ఫ్యామిలీపై అభిమానం చాటుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో పలు ఇంటర్వ్యూల్లోనూ ‘మీకు బాగా ఇష్టమైన నటుడు’ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ‘చిరంజీవి ఆల్వేస్‌’ అని సమాధానమిచ్చారు. అలాగే ఖైదీ 150 సినిమాకు ముందు ‘ చిరంజీవి150 సినిమా కోసం వేచి చూస్తున్నాను. ఒకసారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం’ అని కవిత చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వీడియోను కూడా కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌..

ఇవి కూడా చదవండి

ఎప్పటికీ చిరంజీవి అభిమానినే..

అల్లు అర్జున్.. తగ్గేదేలే..

నాన్న తర్వాత ఆ రాజకీయ వేత్తనే ఇష్టం..

ఇక రాజకీయాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్లు.. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు’ అని అడగ్గా.. తెలంగాణ ప్రజల దీవెనలతో 100 సీట్లు గెలుస్తామన్నారు కవిత. అలాగే మీ తండ్రి కేసీఆర్‌ కాకుండా మీకు ఇష్టమైన రాజకీయవేత్త ఎవరు?’ అని మరొకరు అడగ్గా మమతా దీదీ అని కవిత సమాధానం ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.