Balakrishna : బాలయ్య డైరీ ఫుల్… నందమూరి బాలకృష్ణ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్స్ వీరే
ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు. NBK మార్కెట్ చూసి కుర్ర హీరోలకు కూడా దడ మొదలైంది. ఆ రేంజ్ దండయాత్ర చేస్తున్నారీయన. ఈయనతో సినిమా కోసం డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నేటి జనరేషన్ దర్శకులు బాలయ్య కోసం కథలు రాస్తున్నారు.. వచ్చే మూడేళ్ల వరకు NBK డైరీ ఫుల్ అయిపోయిందంటే.. ఆయన డిమాండ్ అర్థమైపోతుంది.
బాలయ్య నాకు కావాలి.. కాదు నాకే కావాలి.. మీరు కాదు ఆయనతో సినిమా నేనే చేస్తాను..! ఇదిగో ఇలా ఉంది దర్శకుల పరిస్థితి. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది దర్శకులు బాలయ్య కోసం ఎగబడుతున్నారు.. సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. సడన్‌గా NBK క్రేజ్ ఈ రేంజ్‌లో పెరగడానికి వరస విజయాలే కారణమా లేదంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా..? అసలేంటి బాలయ్య సక్సెస్ మంత్ర..?
ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు. NBK మార్కెట్ చూసి కుర్ర హీరోలకు కూడా దడ మొదలైంది. ఆ రేంజ్ దండయాత్ర చేస్తున్నారీయన. ఈయనతో సినిమా కోసం డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నేటి జనరేషన్ దర్శకులు బాలయ్య కోసం కథలు రాస్తున్నారు.. వచ్చే మూడేళ్ల వరకు NBK డైరీ ఫుల్ అయిపోయిందంటే.. ఆయన డిమాండ్ అర్థమైపోతుంది.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. కేవలం వరస విజయాలే బాలయ్య క్రేజ్ పెంచాయనుకుంటే పొరపాటే.. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటారు. 100 కోట్ల మార్కెట్ ఉన్నా.. 20 నుంచి 25 కోట్ల మధ్యలోనే ఈయన పారితోషికం ఉంది. పైగా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది.
బాబీ సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు బాలయ్య. 1980స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా మూవీ ఇది. దీని తర్వాత సుకుమార్, NBK కాంబోలో దిల్ రాజు ఓ సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తుంది. బోయపాటి కూడా అఖండ 2కు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితోనూ కాంబో రిపీట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మరో మూడేళ్ళ వరకు బాలయ్య ఫుల్ బిజీ.
View this post on Instagram
బాలకృష్ణ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..