AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇచ్చేయండర్రా.. కప్పు కూడా ఇచ్చేసేయండి.. తనూజ పై నెట్టింట పేలుతున్న మీమ్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో తొమ్మిదవ వారంలోకి వచ్చేసింది. దీంతో ఇప్పటి నుంచి కంటెస్టెంట్ల గేమ్ కీలకంగా మారనుంది. వారి ఆట, మాట తీరే వారిని హౌస్ లో ఉంచాలా? వద్దా? అని నిర్ణయిస్తోంది. కాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రస్తుతం హౌస్ లో హోరా హోరీ పోరు జరుగుతోంది. గత రెండు రోజులకు కెప్టెన్సీ కోసం జరుగుతున్న పోటీకి ఎట్టకేలకు ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడనుంది.

ఇచ్చేయండర్రా.. కప్పు కూడా ఇచ్చేసేయండి.. తనూజ పై నెట్టింట పేలుతున్న మీమ్స్
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2025 | 8:42 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్.. ట్రోల్స్ పేలుతుంటాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుంది. ఇప్పటికే సీజన్ 9 67 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం హౌస్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. ఈ వారం నామినేషన్స్ లో దివ్య, సంజన, సుమన్ శెట్టి, భరణి, నిఖిల్ , గౌరవ్, కళ్యాణ్, డిమాన్ పవన్, తనూజ, రీతూ చౌదరి ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ ఒక్కడే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన పదిమందిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు రానున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి సీరియల్ నటి తనూజ ముందంజలో ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ కూడా ఆమెనే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఆమె ఏం చేసినా కూడా అబ్బా..! సూపర్..!! అంటూ ఆమెను తెగ లేపుతున్నారు. ఆమె ఏదైనా తప్పు చేస్తే అసలు ఎక్కడా కూడా చూపించడం లేదు.. అలాగే వారాంతంలో వచ్చే నాగార్జున కూడా తనుజను పెద్దగా తిట్టింది కనిపించలేదు. దాంతో ఆమెను బిగ్ బాస్ దత్తపుత్రిక, ముద్దుబిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మీమ్స్..ట్రోల్స్ పేలుతున్నాయి.

ఇక రీసెట్ గా హౌస్ లో తనూజ రాణిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న మెంబర్స్ ను రాజు , రాణులు, కమాండర్లు, పనోళ్ళు , ప్రజలు అంటూ డివైడ్ చేశారు.. మొదట్లో కళ్యాణ్ రాజుగా, దివ్య, రీతూ రాణులుగా ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ ను తప్పించి.. తనూజను రాణిని చేశారు. దాంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. అనుకున్నదే అయ్యింది. రాణిని చేశారంటే రేపు విన్నర్ ను కూడా చేసేస్తారు అంటున్నారు నెటిజన్స్. ఇచ్చేయండర్రా.. కప్పు కూడా ఇచ్చేసేయండి.. తనూజ పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్