Megha Akash: మేఘా ఆకాశ్ ఇంట్లో విషాదం.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ హీరోయిన్ ఎమోషనల్
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బామ్మ మరణంతో తాను బాగా కుంగిపోయినట్లు ఇందులో ఆవేదన వ్యక్తం చేసింది మేఘా. ‘డియర్ అమ్మమ్మ.. నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు తెలియడం లేదు.. ఇక ముందు నేను ఎలా బతుకుతానో కూడా నాకు తెలియడం లేదు. అయితే నేనూ నీలాంటి దాన్నే కాబట్టి ఎలాగైనా బతికేస్తాననకుంటున్నా.. నువ్వు ఎంతో సరదాగా ఉండేదానివి. ఎంతో దయతో మెలిగేదానివి.. ఎంతో మంచిదానివి. నువ్వు అందరి కడుపులు నింపేందుకు ప్రయత్నిస్తుంటావు. అందరి మొహం మీద నవ్వులు పూయించేందుకు ప్రయత్నిస్తుంటావు. రోజు నీతో మాట్లాడే మాటలు, చేసే గాసిప్పులు ఇకపై ఉండవని తలుచుకుంటూనే బాధేస్తోంది. ఇప్పుడు నువ్వు నీ మనిషి దగ్గరకు వెళ్లావ్.. ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది. ఇకపై ఆదివారాలు అలా ఉండవు.. మా అందరిలోనూ నిన్ను చూసుకుంటాం. మాలోనే నువ్వు జీవిస్తూ ఉంటావు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని తన ఆవేదరకు అక్షర రూపమిచ్చింది మేఘ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
నితిన్‌తో కలిసి లై అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మేఘా ఆకాశ్. ఆతర్వాత చల్ మోహన్ రంగ, పేట, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే తెలుగులో తక్కువ చిత్రాలు చేస్తున్నప్పటికీ కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రవితేజ రావణాసురలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని తమిళ్, మలయాళ సినిమాలకు పచ్చ జెండా ఊపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.