గురు రామాచారి ఆధ్వర్యంలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రారంభం.. మరికొద్ది క్షణాల్లో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్
సంగీతాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 మరికొన్ని నిమిషాల్లో ప్రసారం కానుంది. రియాలిటీ షోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో మొదటి ఎపిసోడ్ ఇవాళ (మార్చి3) 7 గంటలకు ఆహా వేదికగా ప్రసారం కానుంది.
సంగీతాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 మరికొన్ని నిమిషాల్లో ప్రసారం కానుంది. రియాలిటీ షోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో మొదటి ఎపిసోడ్ ఇవాళ (మార్చి3) 7 గంటలకు ఆహా వేదికగా ప్రసారం కానుంది. ఈ సారి మరిన్ని హంగులు, హార్ట్ టచింగ్ పెర్ఫామెన్స్‌లతో షోను తీర్చిదిద్దారని ఇప్పటికే విడుదలైన ప్రోమోలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అదనపు హంగులు సమకూర్చడంలో భాగంగా టాలీవుడ్ గురు రామాచారి ఆధ్వర్యంలో సింగింగ్ మారథాన్‌ను ఏర్పాటు చేశారు ఆహా మేకర్స్. ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ మారథాన్‌కి విశేషమైన స్పందన వచ్చింది. లిటిల్ మ్యూజీషియన్స్ అకాడెమీ సింగర్స్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు రామాచారి మాట్లాడుతూ సుమధురమైన గళాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సొంతమన్నారు. ‘సంగీత ప్రపంచంలో గేమ్ చేంజర్‌గా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‌కి పేరుంది. ఫస్ట్ సీజన్‌లో అద్భుతమైన గళాలను ఆస్వాదించగలిగాం. ఈ షోతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సీజన్‌లో నా శిష్యులు కొందరు పాల్గొన్నారు’.
‘నా శిష్యుల ప్రతిభను వేదిక మీద చూస్తున్నప్పుడు గురువుగా మురిసిపోతాను. ఈ సీజన్‌తో మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేస్తాం. అంకిత భావం, అకుంఠిత శ్రమతో గాయనీ గాయకులు తమ తమ రంగాల్లో రాణించగలుగుతారు. తమను తాము నిరూపించుకోవాలన్న కసి ఉన్న అభ్యర్ధులకు తెలుగు ఇండియన్ ఐడల్ 2 పర్ఫెక్ట్ స్టేజ్ అవుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతిభావంతులు అందిపుచ్చుకుని సఫలీకృతం చేసుకోవాలి’ అని గురు రామాచారి పిలుపునిచ్చారు. కాగా తాజా సీజన్లో ఇండియన్ ఐడల్ షోకు ప్రముఖ సింగర్ హేమచంద్ర హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఎస్.ఎస్. థమన్, కార్తీక్, గీతామాధురి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ‘దునియాని దున్నేద్దాం’ అంటూ ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, సింగింగ్ షోపై అమితాసక్తిని రేపుతున్నాయి.
#TeluguIndianidolS1 contestant and #TeluguIndianidol2 contestant pota poti ga padithe. Double dhamaka entertainment. ? Idi just sample matrame. 1 hour to go for the biggest singing show #TeluguIndianidol2 Episode 1@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem pic.twitter.com/XTgSqseqkA
— ahavideoin (@ahavideoIN) March 3, 2023
This time entertainment is doubled! Excitement is doubled !! With the world’s biggest singing stage. Watch #TeluguIndianidol2 Episode 1, today at 7PM. #TeluguIndianIdol2 @MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem@southindiamalls @realmeIndia @KhiladiOfficia3 pic.twitter.com/pi4o74GNkR
— ahavideoin (@ahavideoIN) March 3, 2023