AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butta Bomma: ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ బుట్టబొమ్మ.. అనికా సురేంద్రన్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బుట్టబొమ్మ. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో సూర్య వశిష్ఠ్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు.

Butta Bomma: ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ బుట్టబొమ్మ.. అనికా సురేంద్రన్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Butta Bomma Ott
Basha Shek
|

Updated on: Mar 04, 2023 | 7:53 AM

Share

చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బుట్టబొమ్మ. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో సూర్య వశిష్ఠ్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ కప్పెలాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ బుట్టబొమ్మను తెరకెక్కించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లతో రిలీజ్‌కు ముందు ఎన్నో అంచనాలు పెంచేసిన బుట్టబొమ్మ థియేటర్లలోకి విడుదలయ్యాక మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 4 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే ఫీల్‌ గుల్‌ లవ్‌ స్టోరీ కావడం, అనిఖా సురేంద్రన్‌ యాక్టింగ్‌ యువతను థియేటర్లకు రప్పించాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘బుట్టబొమ్మ’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఇవాల్టి (మార్చి 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

బుట్టబొమ్మ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ల‌వ్ స్టోరీకి హ్యూమ‌న్ ట్రాఫికింగ్ పాయింట్‌ను జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమాలో నవ్య స్వామి, జగదీశ్ ప్రతాప్ భండారి, రాజ్ తిరందాసు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇదిలా ఉంటే సెన్సార్ లేకుండానే బుట్టబొమ్మను స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి థియేటర్లలో బుట్టబొమ్మను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!