Good Luck Sakhi: కీర్తి సురేష్ సినిమాకు సపోర్ట్ గా బడా హీరో.. గుడ్ లక్ సఖి ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఎవరంటే..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. ఆ సినిమాలో తన నటనతో క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Good Luck Sakhi: ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. ఆ సినిమాలో తన నటనతో క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది కీర్తి. ఇక తాజాగా ఈ అమ్మడు గుడ్ లక్ సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు సినీ ప్రియుల మెప్పు పొందాయి. కాగా ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
అయితే ఎట్టకేలకు గుడ్ లక్ సఖి సినిమా ను ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 28న థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్ ఈ క్రమంలోనే నేడు (26న ) గుడ్ లక్ సఖి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్ ఈ చిత్రంలో చిరు చెల్లెలి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :