ఒకే ఫ్రేమ్‏లో చిరు, పవన్, రామ్ చరణ్.. మెగా అభిమానులకు బిగ్ సర్‏ఫ్రైజ్ ఇవ్వనున్న మేకర్స్..

అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన

ఒకే ఫ్రేమ్‏లో చిరు, పవన్, రామ్ చరణ్.. మెగా అభిమానులకు బిగ్ సర్‏ఫ్రైజ్ ఇవ్వనున్న మేకర్స్..
Megastar Chiranjeevi Ramcha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 20, 2021 | 7:20 AM

అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో పింక్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇందులో పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మగువా మగువా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‏తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతేడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిధులుగా అగ్ర హీరోలు వస్తున్నట్లుగా ఓ వార్త ఫీల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితోపాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ ఈవెంట్‏లో మెగా హీరోలు ముగ్గురు ఒకే ఫ్రేంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే గనక జరిగితే ఫ్యాన్స్‏కు పండగే. అటు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కొణిదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read:

బిగ్‏బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్.. తనతో ఉన్నవారందరూ టేస్ట్ చేయించుకోవాలంటూ ట్వీట్..

Ram Charan: ‘ఆచార్య’కు బాయ్‌ బాయ్‌… ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు హాయ్‌… షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మెగా పవర్‌ స్టార్‌..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ