AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్.. తనతో ఉన్నవారందరూ టేస్ట్ చేయించుకోవాలంటూ ట్వీట్..

Bigg Boss Season 14: బిగ్‏బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి కరోనా బారీన పడింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‏లో ఉంది. దేశంలో మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గతకొద్ది

బిగ్‏బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్.. తనతో ఉన్నవారందరూ టేస్ట్ చేయించుకోవాలంటూ ట్వీట్..
Nikki Thamboli
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2021 | 6:44 AM

Share

బిగ్‏బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి కరోనా బారీన పడింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‏లో ఉంది. దేశంలో మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గతకొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కరోనా భారీగా పడుతున్నారు.

హిందీలో అత్యంత ప్రేక్షాధరణ కలిగిన రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss Season 14) ఇటీవలే ఘనంగా ముగింపు పలికింది. ఇందులో పాల్గోన్న కంటెస్టెంట్స్ లలో ఒకరైన నిక్కితంబోలి కోవిడ్ భారీన పడింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు జరిపించారు. అందులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె డాక్టర్ సూచనలతో హోం క్యారంటైన్‏కు వెళ్లింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ… ఇటీవల తనతో కలిసి ఉన్నవాళ్లందరూ దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నానంటూ.. తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. నిక్కితంబోలి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఆ తర్వాత తిప్పరా మీసం సినిమాలోనూ కనిపించింది. ఈ రెండు సినిమాల తర్వాత నిక్కితంబోలికి తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ పై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ షో ద్వారా అటు హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Also Read:

Acharya Movie: ‘ఆచార్య’ సినిమా నిజంగా అలా ఉంటుందా ?.. అసలు విషయం బయట పెట్టిన మెగాస్టార్..

‘మోసగాళ్ళు’ ట్విట్టర్ రివ్యూ: మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసాడా ? ‘మోసగాళ్లు’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ టాక్..

స్పెషల్ సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీం.. ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..