AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie: ‘ఆచార్య’ సినిమా నిజంగా అలా ఉంటుందా ?.. అసలు విషయం బయట పెట్టిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. డైరక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,

Acharya Movie: 'ఆచార్య' సినిమా నిజంగా అలా ఉంటుందా ?.. అసలు విషయం బయట పెట్టిన మెగాస్టార్..
Acharya Movie
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2021 | 1:36 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. డైరక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యా్ట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీ గురించి గత కొద్ది రోజులుగా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నాయి.

మెగాస్టార్ చిరు ఎక్కువగా మాట్లాడితే సినిమాకు సంబంధించిన విషయాలను బయటపెట్టెస్తుంటాడు. గతంలో ఓసారి మాట్లాడుతూ.. మూవీ టైటిల్ బయటపెట్టేసాడు చిరు. ఇక ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్రను చరణ్ చేస్తున్నాడంటూ.. అసలు విషయం చేప్పేసాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక విషయాన్ని బయటపెట్టాడు చిరు. సినిమా ఆరంభం నుంచి దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈ మూవీ నక్సల్స్ నేపథ్యంలో రాబోతున్న కథ అంటూ ఫీల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం పై ఇప్పటి వరకు అటు చిత్రయూనిట్ కానీ.. డైరెక్టర్ కూడా ఎక్కడా బయటపెట్టలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన అసలు విషయాన్ని చిరు పొరపాటు చెప్పేసాడు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ఆ సమయంలో ఈ చిత్రాన్ని చూస్తుంటే నక్సల్స్ బ్యాక్ డ్రాప్‏లో రూపొందినట్లుగా తెలుస్తోంది. మా ఆచార్య సినిమా కూడా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అని టక్కన అనేసాడు. ఇంకేముంది… చిరు ఇచ్చిన ఈ క్లారిటీతో ఇన్నిరోజులుగా ఈ మూవీపై వస్తున్న వార్తలను క్లియర్ చేసేసాడు చిరు. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

Also Read:

‘మోసగాళ్ళు’ ట్విట్టర్ రివ్యూ: మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసాడా ? ‘మోసగాళ్లు’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ టాక్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!