Megastar Chiranjeevi: చిరంజీవిని కలిసిన పుష్ప డైరెక్టర్.. సుకుమార్‌పై మెగాస్టార్ ప్రశంసలు..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మార్క్ దాటేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో బన్నీ ఊరమాస్ లుక్‌లో స్మగ్లర్ లారీ డ్రైవర్ పాత్రలో అదరగొట్టాడు. మొదటి సారి అల్లు అర్జున్ ఇలా ఊర మాస్ లుక్కులో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక పుష్ప సినిమానే కాకుండా.. అందులోని పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడా చూసిని పుష్ప మేనియా కొనసాగుతుంది. నెట్టింట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది పుష్ప. దీంతో ఈ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. బన్నీ, రష్మిక మందన్న నటనపై సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
అలాగే పాన్ ఇండియా చిత్రం పుష్ప బ్లాక్‌బస్టర్ విజయంతో సాధించడంతో దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిసి అభినందించారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందన్నారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు చిరంజీవి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాధర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో పూర్తిచేసిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ చిత్రం ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది.
Megastar @KChiruTweets garu watched & loved every bit of #PushpaTheRise ?
Met @aryasukku garu & congratulated for the Blockbuster Success ?#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @ThisIsDSP @adityamusic @TSeries @PushpaMovie pic.twitter.com/qyzD7riGME
— Mythri Movie Makers (@MythriOfficial) December 27, 2021
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…