AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఉపాసన, కవలలు ఆరోగ్యంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. చిరంజీవి..

మెగా ఇంట ఆనందం డబుల్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన బాబుకు, పాపకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో మెగా కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యింది. దీంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

Megastar Chiranjeevi: ఉపాసన, కవలలు ఆరోగ్యంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. చిరంజీవి..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2026 | 12:34 PM

Share

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. చరణ్ సతీమణి ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన బాబుకు, పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కవలల రాకతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు సైతం సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు మెగా కుటుంబానికి, చరణ్ , ఉపాసన దంపతులకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అపోలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

చిరంజీవి మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతోపాటు బిడ్డలు ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటినుంచో .. ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని చాలామంది కోరుకున్నారు. ఆ భగవంతుడి దయతో.. హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఈ శుభవార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు ఇంతగా ఆనందం వ్యక్తం చేయడం మా కుటుంబానికి ఎంతో ఆనందం. మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

మెగా కుటుంబంలోకి కవలల రాకతో ఆనందం రెట్టింపు అయ్యింది.ఇప్పటికే మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. క్లింకార అక్కగా ప్రమోషన్ పొందిందని.. చిట్టి కవలల కోసం వాయువ్ ఎదురుచూస్తున్నాడంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..