AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: చిరు కామెడీ టైమింగ్ వేరేలెవల్.. భోళా శంకర్ టీమ్‏తో మెగాస్టార్ ఫన్ ఫుల్ ఇంటర్వ్యూ..

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‏గా రూపొందించిన ఈ మూవీలో చిరు జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అలాగే చిరు చెల్లిగా కీర్తి సురేష్.. ఆమె ప్రియుడిగా సుశాంత్ కనిపించనున్నారు. వీరు మాత్రమే కాకుండా.. యాంకర్ శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక భోళా శంకర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది చిత్రయూనిట్.

Bhola Shankar: చిరు కామెడీ టైమింగ్ వేరేలెవల్.. భోళా శంకర్ టీమ్‏తో మెగాస్టార్ ఫన్ ఫుల్ ఇంటర్వ్యూ..
Bhola Shankar Team Intervie
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2023 | 6:15 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన భోళా శంకర్ మేనియా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ షేర్ చేస్తూ మూవీపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. మరోవైపు థియేటర్లలో చిరంజీవి భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తూ సందడి మొదలు పెట్టేశారు మెగా ఫ్యాన్స్. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‏గా రూపొందించిన ఈ మూవీలో చిరు జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అలాగే చిరు చెల్లిగా కీర్తి సురేష్.. ఆమె ప్రియుడిగా సుశాంత్ కనిపించనున్నారు. వీరు మాత్రమే కాకుండా.. యాంకర్ శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక భోళా శంకర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ టీమ్ ఓ ఫన్ ఫుల్ ఇంటర్వ్యూ చేసింది.

కేవలం భోళాశంకర్ టీమ్ మాత్రమే ఉండి.. ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. అందులో డైరెక్టర్ మెహర్ రమేశ్, మెగాస్టార్ చిరంజీవి, శ్రీముఖి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ వీడియో చిరు తన కామెడీ టైమింగ్‏తో అదరగొట్టారు. ఓవైపు తమన్నా.. మరోవైపు కీర్తి చిరు పక్కన కూర్చొని ఉండగా.. చిరు తన కామెడీ స్టైల్ తో నవ్వులు పూయించారు. భోళా శంకర్ టీమ్ ఫుల్ ఇంటర్వ్యూ మంగళవారం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది.

ఈ సినిమా తర్వాత చిరు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమా రీమేక్ గా రాబోతుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన ఈ సినిమాలో చిరుతోపాటు.. మరో యంగ్ హీరో నటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.