Tollywood : నటుడిగా కెమెరా ముందుకు తొలిసారిగా.. ఇండస్ట్రీని అల్లాడించిన ఏకైక హీరో.. ఏళ్లైనా చెక్కు చెదరని అభిమానం..
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ కుర్రాడు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. చక్కని రూపం.. చూడచక్కని చిరునవ్వు.. అయినా ఒక్క అవకాశం కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. అవమానాలు, విమర్శలు భరించి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఎదురులేని నటుడిగా మారారు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత నాలుగున్నర దశాబ్దాలుగా సినీప్రియులను అలరిస్తూ తనదైన ముద్ర వేశారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా నిరూపించుకున్నారు. కేవలం ప్రతిభ, స్వయంకృషితో అగ్ర నటుడిగా మారారు. బాక్సాఫీస్ హిట్లకు మారుపేరుగా నిలిచి.. తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. రికార్డుల్లో ఆయన పేరు ఉండడం కాదు.. ఆయన పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ? ఆయన పేరు కొణిదెల శివశంకరవరప్రసాద్. సినీరంగంలోకి అడుగుపెడుతూ తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. ఒక్కో అవకాశం కోసం ఎన్నో కష్టాలు భరించారు. అనేక విమర్శలు భరించారు. సినీరంగంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష, సినిమాల పట్ల అంకిత భావం.. ఇవే చిరు విజయానికి మెట్లు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
చిరంజీవి పునాది రాళ్లు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. కానీ ప్రాణం ఖరీదు మూవీ ముందుగా విడుదలై ఆయనను వెండితెరకు పరిచయం చేసింది. అయితే పునాది రాళ్లు సినిమా కోసం మొదటి సారిగా కెమెరా ముందు నిల్చున్న క్షణాన్ని గుర్తు చేసుకున్నారు చిరు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీ్ట్ చేశారు. “ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. – చిరంజీవి” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు చిరు. ఇటీవలే సంక్రాంతి పండగా సందర్భంగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది..జబర్దస్త్ కమెడియన్..
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
