Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు.. చిరంజీవికి రాఖీ కట్టిన సిస్టర్స్‌.. వీడియో చూశారా?

Raksha Bandhan 2023: టాలీవుడ్‌ మెగాస్టార్‌ ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదుర్గ, మాధవి చిరంజీవికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించాడు. అనంతరం అన్నయ్య నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు చిరంజీవి. అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కాలికి సర్జరీ జరిగిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు.. చిరంజీవికి రాఖీ కట్టిన సిస్టర్స్‌.. వీడియో చూశారా?
Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2023 | 6:17 PM

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టువులకు రాఖీలు ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక టాలీవుడ్‌ మెగాస్టార్‌ ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదుర్గ, మాధవి చిరంజీవికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అనంతరం అన్నయ్య నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు చిరంజీవి. అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కాలికి సర్జరీ జరిగిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ వీడియోలో చిరంజీవి కుర్చీలో కూర్చొని కనిపించడం గమనార్హం. ఇక అల్లు వారి ఇంట్లోనూ రక్షా బంధన్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. అల్లు అర్జున్‌ గారా పట్టి అల్లు అర్హ తన అన్నయ్య అయాన్‌ రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలను బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి. వీరితో పాటు శ్రీముఖి, సన్నీలియోన్‌, పూజాహెగ్డే, సారా అలీఖాన్‌ ఇంట్లోనూ రాఖీ వేడుకలు జరిగాయి. వీరు తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల భోళాశంకర్‌ గా మన ముందుకొచ్చారు చిరంజీవి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది. వేదాళం రీమేక్‌కు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక తన పుట్టిన రోజు కొత్త సినిమాలను ప్రకటించారు చిరంజీవి. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో తెరకెక్కిస్తోన్న ఓ సోషియో పాంటసీ మూవీలో మెగాస్టార్‌ నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే తన కూతురు సుస్మిత ప్రొడక్షన్ బ్యానర్‌లోనూ ఓ కొత్త ప్రాజెక్టను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇంట్లో  రక్షాబంధన్ సెలబ్రేషన్స్

అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ వేడుకలు

మనవరాలు క్లింకారాతో మెగాస్టార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో