Bhola Shankar: బాసూ క్రేజ్ అంటే ఆమాత్రం ఉంటది మరి.. ‘భోళా శంకర్’ భారీ కటౌట్.. ఇండస్ట్రీలోనే అతిపెద్దది..
ముఖ్యంగా ఇందులో చిరు లుక్స్... స్టైల్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుచేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు సరికొత్తగా ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్. భోళా శంకర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈఏడాది ప్రారంభంలోనై వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ సందడి మొదలైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ముఖ్యంగా ఇందులో చిరు లుక్స్… స్టైల్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుచేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు సరికొత్తగా ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్. భోళా శంకర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ఏర్పాటు చేసింది.
తెలంగాణలోని సూర్యపేటలో విజయవాడ, హైదరాబాద్ హైవే పక్కన రాజు గారి తోట వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ఏర్పాటు చేసింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ . ఈ కటౌట్ తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలోనే అతి పెద్దదని తెలుపుతూ కటౌట్ ఫోటో షేర్ చేసింది. అయితే కటౌట్ ఎన్ని అడుగులు ఉందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం చిరు భారీ కటౌట్ నెట్టింట వైరలవుతుండగా.. ఇది 100 అడుగులు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరు భారీ కటౌట్ చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. ఆయన చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు నెలకొన్నాయి భోళా శంకర్ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది.
The countdown begins for the MEGA FESTIVAL in theatres on August 11th💥🥁
MegaStar @KChiruTweets’ MEGA MASSIVE Cutout Launched at Raju Gari Thota, Suryapeta🔥
HIGHEST EVER CUTOUT IN TFI 😎❤️🔥
A film by @MeherRamesh@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/S9HbRfYPaf
— AK Entertainments (@AKentsOfficial) July 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.