Acharya Movie: మరోసారి సెట్స్ పైకి ఆచార్య.. ఊటీ బాట పట్టిన చిరు.. చరణ్.. కారణమేంటంటే..

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్ పూర్తిచేసిన చిరు.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‍లో

Acharya Movie: మరోసారి సెట్స్ పైకి ఆచార్య.. ఊటీ బాట పట్టిన చిరు.. చరణ్.. కారణమేంటంటే..
Achrya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 6:02 PM

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్ పూర్తిచేసిన చిరు.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‍లో ఉన్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ కంటే ముందు చిరు పూర్తిగా ఆచార్య సినిమాకు సమయం కేటాయించారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. ఇక సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. దీంతో అటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరు, చరణ్ మరోసారి ఆచార్య సెట్‏కు వెళ్లనున్నారట. ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టా్ర్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ ఇంకా మిగిలే ఉందని.. చరణ్.. చిరు.. తమ తదుపరి సినిమాలతో బిజీగా ఉండడంతో రెండు పాటలను వాయిదా వేశారట. ఇప్పుడు ఈ పాటలకు తిరిగి షూట్ చేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్. ఇందులో ఒక పాటను ఊటీలో చిత్రీకరిస్తారని.. మరో పాటను హైదరాబాద్ శివార్లలో షూట్ చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా సెట్ కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో చిరు, చరణ్‌లపై ఓ సాంగ్‌ షూటింగ్‌ను నిర్వహించబోతున్నాడట. మరో పాట షూటింగ్‌ చరణ్‌-పూజా హెగ్డేలపై జరగనుందని, వచ్చే వారం ఈ పాట షూటింగ్‌ను జరపనున్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఈ రెండు పాటల షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Viral Video: ఇదేం సాహసం రా బాబు.. ప్రాణాలతో చెలగాటమే.. వీడియో చూస్తున్నంతసేపు ఊపిరి బిగపట్టాల్సిందే..

Viral Video: ఇదేం సాహసం రా బాబు.. ప్రాణాలతో చెలగాటమే.. వీడియో చూస్తున్నంతసేపు ఊపిరి బిగపట్టాల్సిందే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?