AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: సీఎం కేసీఆర్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: సీఎం కేసీఆర్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2022 | 12:28 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో  వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటూ అరుదైన ఫోటో షేర్ చేసుకున్నారు చిరంజీవి.

మరోవైపు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేసీఆర్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కేసీఆర్ . ఎంతటి జటిలమైన తెలంగాణమ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో… వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం కేసీఆర్ గారిని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. సమకాలీన రాజకీయ నాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పర్చుకోని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కేసీఆర్ గారిలోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్థులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తోపాటు.. తెలంగాణ అంతట శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ తెలిపారు.

అలాగే… సీఎం కేసీఆర్‏కు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…