Ram Charan: మరో వాణిజ్య ప్రకటనలో రామ్ చరణ్.. సీతతో కలిసి ప్రచారం చేయనున్న రామరాజు

Ram Charan: టాలీవుడ్(Tollywood) మెగా పవర్ రామ్ చరణ్(Megapowerstar Ram Charan) ఓ వైపు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు వాణిజ్య ఉత్పత్తులతో బ్రాండ్ అంబాసిడర్(brand ambassador)గా చేస్తున్నాడు..

Ram Charan: మరో వాణిజ్య ప్రకటనలో రామ్ చరణ్.. సీతతో కలిసి ప్రచారం చేయనున్న రామరాజు
Ram Charan As Brand Ambassa
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 05, 2022 | 1:44 PM

Ram Charan: టాలీవుడ్(Tollywood) మెగా పవర్ రామ్ చరణ్(Megapowerstar Ram Charan) ఓ వైపు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు వాణిజ్య ఉత్పత్తులతో బ్రాండ్ అంబాసిడర్(brand ambassador)గా చేస్తున్నాడు. ఇప్పటికే ప‌లు వాణిజ్య ప్రక‌ట‌న‌ల్లో కనిపించిన ఈ మెగా హీరో.. తాజాగా మ‌రో కొత్త ఉత్పత్తికి ప్రచారం చేయనున్నాడు. ప్రముఖ పానీయాల కంపెనీ పార్లే ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఫ్రూటీకి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.  ఆర్ఆర్ఆర్ ఫేమ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో కలిసి రామ్ చరణ్ ను ఫ్రూటీని ప్రమోషన్ చేయనున్నాడు.

భార‌త బీవ‌రేజెస్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్పత్తి అయిన ఫ్రూటీకి ఇప్పటికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌కర్తగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చెర్రీ కూడా ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవ‌హ‌రించ‌నున్నాడు. ఇద్దరు కలిసి తమ బ్రాండ్ కు ప్రచారం చేయ‌నున్నారని పార్లే ఆగ్రో తెలిపింది. ఈ మేర‌కు శక్రవారం ఆ సంస్థ ఓ ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

ఇప్పటికే పార్లే ఆగ్రో బ్రాండ్ అంబాసిడర్‌లుగా అప్పీ ఫిజ్ కోసం ప్రియాంక చోప్రా, బి ఫిజ్ కోసం అర్జున్ కపూర్,  మిల్క్ స్మూతీ కోసం వరుణ్ ధావన్ ఉన్నారు. తాజాగా ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ చేరుతున్నాడు. అలియా భట్ తో జతకడుతున్నాడు. ఫ్రూటీ దేశంలోని ప్రముఖ మామిడి పానీయాలలో ఒకటి.

“రెండేళ్ల విరామం తర్వాత తాము యాక్షన్ ప్యాక్డ్ సమ్మర్‌లోకి ప్రవేశిస్తున్నామని పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్,  సిఎంఓ నదియా చౌహాన్ చెప్పారు. ఈ సీజన్ ను రామ్ చరణ్, అలియా భట్ లతో ప్రారంభిస్తామని.. వీరికి ప్రజల్లో ఉన్న ఆకర్షణ, ఆదరణ తమ ఫ్రూటీకి అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పారు. హీరో రామ్ చరణ్.. పార్లే ఆగ్రో కుటుంబంలో భాగమైనందుకు.. తమ ఫ్రూటీతో అనుబంధం కలిగి ఉన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఫ్రూటీ అమ్మకాల‌ను మ‌రింత‌గా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఆర్ఆర్ఆర్’లో చెర్రీ, అలియాలు కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాని టాలీవుడ్ ద‌ర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కించాడు.  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Also Read:

కొత్త అవతారం ఎత్తిన నాగచైతన్య.. కెరీర్‌లో విషయంలో మరో కీలక అడుగు..