Varun Tej’s Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని. కిరణ్ కొర్రుపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

Varun Tej's Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Gani
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 15, 2022 | 3:31 PM

Varun Tej’s Ghani: మెగా హీరో వరుణ్ తేజ్(Mega hero Varun Tej )నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని( Ghani ). కిరణ్ కొర్రుపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ మెగా హీరో.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఆతర్వాత కంచె, ఫిదా, లోఫర్, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ఇక ఇప్పుడు గనిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. అల్లు బాబీ కంపెనీ,  సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంది.

దబాంగ్ 3 బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. పంచ్ బ్యాగ్ ను చాలా ఫోర్స్ గా వరుణ్ కొడుతున్నట్టు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను కూడా ఫిబ్రవరి 25నే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో భీమ్లానాయక్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.Varun

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Pilli: దీపికా పిల్లి అందాల విందు మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో