Pawan Kalyan: అమితాబ్ బచ్చన్‌ను కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన పవన్.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన పవన్.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లానాయక్(Bheemla Nayak)సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్. హరిహర వీర మల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను కలిసినట్టు తెలుస్తుంది.
అమితాబ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు అమితాబ్. రామోజీ ఫిలిమ్ సిటీలో ఆయన పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అమితాబ్ ను మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ పవన్ అమితాబ్ ను వివిధ సందర్భాల్లో కలిశారు. చిరంజీవి నటించిన సైరా సినిమా షూటింగ్ సమయంలోనూ పవన్ బిగ్ బిని కలిశారు పవన్.
మరిన్ని ఇక్కడ చదవండి :