Manchu Vishnu: జగన్‌తో ముగిసిన మంచు విష్ణు భేటీ.. దేని గురించి చర్చించారంటే..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు.
Manchu Vishnu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్ నారయణ మూర్తి, పోసాని..ఇతర సినీ ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ తో వ్యక్తిగత మీటింగ్ మాత్రమే అని తెలియజేశారు మంచు విష్ణు. అలాగే తిరుపతిలో స్టూడియోను కడతానని విష్ణు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మంచు మోహన్ బాబు, మంచు విష్ణును కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ కూడా వ్యక్తిగతం మాత్రమే మోహన్ బాబు తెలిపారు. అయితే చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి..జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే సినీ పరిశ్రమలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు పరిష్కారం కానున్నాయని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :