Anu Emmanuel Love Story: అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా.? ఈ పోస్టే దీనికి నిదర్శనమా..?
Anu Emmanuel In Love With Mega Hero: అమెరికాలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అను ఇమ్మాన్యుయేల్ 'మజ్ను' సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాలోనే తన అమాయక నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది...
Anu Emmanuel In Love With Mega Hero: అమెరికాలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అను ఇమ్మాన్యుయేల్ ‘మజ్ను’ సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాలోనే తన అమాయక నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి సినిమాల్లో బడా హీరోల సరసన ఆడిపాడిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే అను గత కొన్ని రోజులుగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమాయణంలో ఉందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అను ప్రేమలో ఉన్న ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు.. మెగా కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ అని తాజాగా నెట్టింట ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆదివారం అను ఇమ్మాన్యుయేల్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇందులో భాగంగా అనుతో సాన్నిహిత్యంగా ఉన్న కొన్ని వీడియో క్లిప్స్‌లను ఒక చోట చేర్చి రూపొందించిన ఓ వీడియోను పోస్ట్ చేసిన శిరీష్.. ‘నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆలస్యంగా చెప్తున్నానని నాకు తెలుసు. కానీ.. ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు ‘సైకో’. వచ్చే ఏడాదంతా నువ్వు ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో అను ప్రేమ కథపై ప్రచారం మరింత ఊపందుకుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
అల్లు శిరీష్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
Also Read: Akshay Kumar: ‘రామ్ సేతు’ షూటింగ్ స్టార్ చేసిన అక్షయ్ కుమార్.. సైంటిస్ట్ లుక్లో ‘ఖిలాడి’ హీరో..
Urvashi Rautela : అందాలందు ఊర్వశి అందాలే వేరయా.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రౌతేలా హాట్ పిక్స్..
Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..